ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Indians Stranded in Nepal

105 మంది గల్లంతు..!

ఎంబసీ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్

Indians Stranded in Nepal : త్రినేత్రం న్యూస్ : కాఠ్మాండూ : పొరుగు దేశం నేపాల్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం ఉదయం నేపాల్‌లోని రసువా జిల్లాలోని భోటే కోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో వందలాది మంది గల్లంతయ్యారు. నేపాల్ టూరిజం బోర్డు ప్రకటన ప్రకారం మొత్తం 384 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఇందులో 105 మంది భారతీయులు ఉన్నారు. అంతేకాకుండా 37 మంది NRIలు కూడా గల్లంతైన వారిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గల్లంతైన వారిలో భారతీయులే కాకుండా అమెరికా, మలేషియా, బ్రిటన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికాకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లినవారని తెలుస్తోంది.

నది ఉప్పొంగి.. గ్రామాలు గల్లంతు

ఉదయం 9 గంటల ప్రాంతంలో టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీ వరద నీరు వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ వరద కారణంగా రసువా, ధాడింగ్, నువాకోట్ జిల్లాల్లోని గ్రామాలు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. దాదాపు 12 హైడ్రో పవర్ ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 8 మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో 26 మంది నేపాల్ పోలీసులు కూడా గల్లంతయ్యారని నేపాల్ పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం నేపాల్ ఆర్మీ, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ 14 హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపడుతున్నారు.

భారత ఎంబసీ ఎమర్జెన్సీ నంబర్లు

నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం కాఠ్మాండూలోని భారత రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది.

సహాయం కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించవచ్చు. ఈ నంబర్లు వాట్సాప్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.

+977 985 131 6807
+977 970 910 7500

అలాగే నేపాల్ టూరిజం బోర్డు టోల్ ఫ్రీ నంబర్ 1234, హాట్ లైన్ 1144 మరియు టూరిస్ట్ పోలీస్ నంబర్ 9851289445 లను కూడా సంప్రదించవచ్చు.

భారతీయుల బంధువులు ఎవరైనా సమాచారం కోసం పై నంబర్లకు ఫోన్ చేయాలని ఎంబసీ కోరింది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page