ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Alert for farmers

Alert for Farmers : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 25 ; రానున్న ఖరీఫ్ సీజన్ నుండి రాష్ట్రంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మరియు పప్పు ధాన్యాలను కనీస మద్దతు ధరకు (యం యస్ పి ) విక్రయించాలంటే రైతుకు ఐడి కార్డు తప్పనిసరి అని అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పౌర సరఫరాల సంస్థ మార్క్ ఫెడ్ జరిపే కొనుగోళ్లకు ఫార్మర్ ఐడి తో అనుసంధానమైన భూములకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో 64.71 లక్షల ఐడీకి లక్ష్యానికి గాను , 51.83 లక్షల రైతులు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులు తక్షణమే రైతు సేవా కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page