
MLA Visits Anna Canteen : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్: ఆగస్టు 25 ; జీలుగుమిల్లిలో నిర్మాణం చివరి దశలో ఉన్న అన్నా క్యాంటీన్ ను పోలవరం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు సందర్శించారు. అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన భవన నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు . నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే ఈ భవన నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, అత్యున్నత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన సేవలను అందించే కేంద్రంగా ఆ క్యాంటీన్ మారనున్నందున, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. నాణ్యమైన తక్కువ ధరకు భోజనం అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe