జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 16 at 6.20.55 PM

TRINETHRAM NEWS

బాపట్ల టౌన్.. జాతీయ ఇంధన పొదుపు గురించి అవగాహన

బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆధ్వర్యంలో శనివారం పోస్టర్ ఆవిష్కరించి ర్యాలీ ప్రారంభించారు. బాపట్ల డివిజన్ ఏపీసీపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా విద్యుత్ పొదుపు గురించి, తద్వారా జాతీయ ఇంధన పొదుపు గురించి, దాని ప్రాముఖ్యతను ప్రజానీకానికి అవగాహన కల్పించారు. ఈ వారోత్సవాలు14 డిసెంబర్ నుంచి21 డిసెంబర్ వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో జి.ఆంజనేయులు ఈ ఈ, సుబ్బారావుsao, బి. హరి ప్రసాద్ రావు DEE, ఆర్. విజయ శ్రీనివాస్ DEE, ఎం. శ్రీనివాసరావు DEE, మరియు ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page