
Young Woman Missing : హైదరాబాద్ నాగోల్ జోన్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నాగోల్: విధులకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన 21 ఏళ్ల సాయి ప్రియ అదృశ్యమైంది. ఆగస్టు 13న ఉదయం 7 గంటలకు న్యూ నాగోల్‌లోని రత్నదీప్‌లో విధులకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులను సంప్రదించి పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు.
యువతి అదృశ్యానికి ప్రభు అనే వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. సాయి ప్రియ 4.5 అడుగుల ఎత్తు, గుండ్రని ముఖంతో, తెలుగు మాట్లాడుతుందని, అదృశ్యమైనప్పుడు నీలం రంగు షర్ట్, ప్యాంట్ ధరించి ఉందని వివరించారు. ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు క్రైమ్ నంబర్ 510/2026 కింద వుమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe