సెప్టెంబర్ 5, 2026
TRINETHRAM NEWS
Inauguration Ramji Multi-Specialty Hospital

ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించాలి.

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ .

Inauguration Ramji Multi-Specialty Hospital : దేవరకొండ డివిజన్ ఆగష్టు 13, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాంజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. దేవరకొండ పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమన్నారు. ఆధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.

ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వ వైద్యశాలలతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు కూడా తమ వంతు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. రాంజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేవరకొండ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆలంపల్లి నరసింహ, పద్య దేవేందర్ నాయక్, నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు వెంకటేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, మైనంపల్లి సర్పంచ్ కొర్ర రామ్ సింగ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వై.ఎస్. కరుణాకర్, వైద్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page