
World Tribal Day : అరకులోయ,ఆగస్టు 9, (త్రినేత్రంన్యూస్): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 10న అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది.
కలెక్టర్ టి. నిశాంతి, మార్గదర్శకత్వంలో ఐటీడీఏ పిఓ ఆదిత్య వర్మ, పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, ఆదివాసీ నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని జిల్లా యంత్రాంగం కోరింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe