
PDS Rice Seized : దేవరకొండ డివిజన్ ఆగష్టు 05, త్రినేత్రం న్యూస్. పేద ప్రజలకు చెందాల్సిన ప్రజాపంపిణీ రేషన్ బియ్యం కొందరు స్వార్థ పరులు దొడ్డిదారిలో బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వివరాలలోకి వెళితే దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామంలో మంగళవారం అర్థరాత్రి కొందరు అక్రమార్కులు బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు మెరుపుదాడి చేసి 20, నుంచి 30క్వింటాళ్ల పి డీ ఎస్ బియ్యం పట్టుకున్నారు.
ఈ ఘటనపై దేవరకొండ సీ ఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పేదల పొట్ట కొట్టి నిత్యావసరాల సరుకులు, రేషన్ బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్ కి తరలిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కఠినంగా హెచ్చరించారు.ఈ అక్రమ రవాణా పై కేసు నమోదు చేశామని నిందితులను త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe