
ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి .. తీదేడు గ్రామ సర్పంచ్
Sekhar Reddy : చింత పల్లి ఆగష్టు 05, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. తల్లి పాలే శిశువులకు అమృతమనీ అన్నారు పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించడం ఎంతో ముఖ్యమని, మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలే అందించడం వల్ల శిశువుకు అవసరమైన సంపూర్ణ పోషకాలు, రోగనిరోధక శక్తి లభిస్తాయని ఆమె తెలిపారు.అనంతరం గర్భిణులు,బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి,ప్రతి తల్లి తన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి,రెడ్డి పద్మ పరమేష్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు సీమర్ల శ్రీను యాదవ్,అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం సిబ్బంది,ఆశా కార్యకర్తలు,గర్భిణులు, బాలింతలు,మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe