
CI Koteswara Rao : అరకు లోయ ఆగస్టు 5, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు అరకు వ్యాలీ మండలం పద్మాపురం గ్రామంలో పోలీసులు మంగళవారం మాదకద్రవ్యాలు, నాటుసారా, రైస్ పుల్లింగ్ కాయిన్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అరకు సీఐ ఏ. కోటేశ్వరరావు, ఎస్సై టి. మల్లేశ్వరరావు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణా, విక్రయం, స్మగ్లర్లకు సహకారం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “గంజాయి జోలికి పోవద్దు… ఖైదీలుగా మారవద్దు” అని సూచిస్తూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అలాగే రైస్ పుల్లింగ్ కాయిన్ పేరుతో జరుగుతున్న మోసాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో నాటుసారా తయారీ లేదా విక్రయం జరుగుతున్నట్లు సమాచారం అందితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలు నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని కోరుతూ, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో అరకు పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe