
Jaggarao : అరకులోయ,ఆగస్టు 5, (త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువ్యాలీ మండలం ఎండపల్లి వలస శ్రీ గంగమ్మ తల్లి న్యూ రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ ఎన్నికలను మంగళవారం యూనియన్ సభ్యులు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గత కరోనా కాలం నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్న జగ్గారావును మరోసారి యూనియన్ సభ్యులందరూ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. యూనియన్ నూతన కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్‌గా కిషోర్, సెక్రటరీగా నాగ భాస్కరరావు, కోశాధికారులుగా దామోదర్, అశోక్, పురుషోత్తం ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు జగ్గారావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఆటో వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న సభ్యులంతా రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. అరకు వ్యాలీకి వచ్చే పర్యాటకులతో మర్యాదపూర్వకంగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని కోరారు. ప్రతి ఆటోకు అవసరమైన వాహన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని, డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఖాకీ యూనిఫాం ధరించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆటో యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికలను విజయవంతం చేశారు. నూతన కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలియజేస్తూ యూనియన్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe