
COVID-19 : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19కు చేరగా.., అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కాకినాడ జిల్లాల్లో రెండేసి, విశాఖ, ఏలూరు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
తాజాగా నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ను గుర్తించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఒమిక్రాన్ RF 5 వేరియంట్ లక్షణాలు… కరోనా ఒమిక్రాన్ RF 5 వేరియంట్ లక్షణాలు సాధరణంగానే ఉంటాయని.. పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, అలసట RF 5 లక్షణాలుగా తెలిపారు. సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో RF 5 కేసులు వెలుగు చూస్తున్నాయని.. RF 5 వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe