ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Downfall Inevitable

డిండి మండలంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

Downfall Inevitable : డిండి( గుండ్ల పల్లి) జులై 10, త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ, విద్య రంగాభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం తప్పదని ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు సురిగి వినయ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం డిండి మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ నిర్వహించిన… రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ పూర్తిగా విజయవంతం అయింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో తరగతులు బహిష్కరించి బంద్ నిర్వహించగా,ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సంపూర్ణ బంద్ పాటించాయి.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు వినయ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో విద్యారంగం పూర్తిగా బ్రష్టు పట్టిపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరచుకోని, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిస్తూ సమగ్ర చట్టాన్ని రూపొందించాలని, తక్షణమే పెండింగ్ లో ఉన్న 9వేల కోట్ల రూపాయల స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు విడుదల చేయాలని, తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని, విద్యార్థులందరికీ ఉచిత బస్పత్ సౌకర్యం కల్పించాలని, ఇంటర్, డిగ్రీ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించి, ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఎస్సీ ఎస్టీ బిసి ఎస్ఎంఎస్ హాస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేకపోతే భవిష్యత్తులో అన్ని విద్యార్థి సంఘాలు సంఘటితమై పెద్ద ఎత్తున ఉద్యమించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు కళ్లెం సిద్దు, తరుణ్, విజయ్, కుమార్, భాస్కర్, శ్యామ్సన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page