జూలై 14, 2026
TRINETHRAM NEWS
MP Kesineni Sivanath

MP Kesineni Sivanath : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 08; తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం లో నివాస ప్రాంతాలకు అనుసంధాన రోడ్డు మంజూరు అయ్యాయని విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) కృషి అభివృద్ధికి అడ్రస్ అని ప్రజలు అంటున్నారు. ఒక వేయి. ఎనిమిది ఒకటి ఐదు కోట్ల కోట్ల అంచనా వ్యయంతో ఒకటి. ఏడు ఒకటి కిలోమీటర్ల రోడ్డు పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన – నాలుగు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు – ఇరువై ఏడు బ్యాచ్ – ఒకటి కింద ఈ రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలకు అంబాసిడర్ గా మారిన కేశినేని చిన్ని తాజాగా మరో అభివృద్ధి కార్యక్రమానికి తోడ్పాటు అందించారు ఆ నియోజకవర్గంలో ఏ కొండూరు మండలం నివాస ప్రాంతాలకు అనుసంధానం చేసే రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా ముందుగా ఆమోదం తెలిపిన కేంద్రానికి ఎంపీ చిన్ని కృతజ్ఞతలు తెలిపారు కేంద్రం నుంచి ఆమోదం పొందిన లేఖను విడుదల చేశారు ప్రధానంగా విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన- నాలుగు ముఖ్యంగా రహదారులు గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర ఈ రహదారులు పోషిస్తాయని లేఖలో పేర్కొంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో ఎంతోమంది బాధితులు ఏ కొండూరు మండలంలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారికి మంచి త్రాగునీరు అందించడంతోపాటు తాజాగా కనెక్టివిటీ రోడ్లను కూడా ఆ మండలానికి అందించారు. ఎంతో కాలం నుండి సరైన కనెక్టివిటీ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న మండలానికి ఎంపీ చిన్ని కనెక్టివిటీ రోడ్ను తీసుకువచ్చి అక్కడి ప్రజలకు బాసటగా నిలిచారు.

అడిగిన వెంటనే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏ కొండూరు మండలానికి రోడ్డు పనిని మంజూరు చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఎంపీ చిన్ని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో విజయవాడ పార్లమెంట్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలియజేశారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page