ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
CM Tribute Janakamma

CM Tribute Janakamma : త్రినేత్రం న్యూస్ : శనివారం తుది శ్వాస విడిచిన గాన కోకిల, ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకమ్మకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళుల అర్పించారు.

క్యాంప్ కార్యాలయంలో జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలుగు నేలపై జన్మించిన జానకమ్మ ఆరు దశాబ్దాలకు పైగా తన అపూర్వ గానంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్నారని సీఎం పేర్కొన్నారు.

ఆమె పాటలు అందరి హృదయాల్లో నిలిచిపోతాయన్నారు. జానకమ్మ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page