
Chief Minister : గుంటూరు జిల్లా : అమరావతి ,: త్రినేత్రం న్యూస్ : జూలై 08; రాష్ట్రంలో సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ , వసతి గృహాలు కాదు, ఇకపై గురుకులాలనే నిర్మిద్దామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ లోని ఉత్తమ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంక్షేమ శాఖల విద్యాసంస్థల్లో చదివిన పూర్వ విద్యార్థుల నెట్ వర్కింగ్ మొదలవుతుందని సంబంధిత అధికారులకు సూచించారు.
అదేవిధంగా రూపాయలు వంద కోట్లతో గురుకులాల పాఠశాలలు మరియు వసగృహాలు కొరకు మరమ్మతులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. బడుగుల జీవనోపాధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులకు పి – నాలుగు అనుసంధానం చేస్తామని ప్రకటించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe