
Who Murdered : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 07; చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, పేరంపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కారుమూడి దుర్గారెడ్డి హత్య జరిగిన సంఘటన తెలిసిన వెంటనే ఘటన స్థలానికి డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ అక్కడకు చేరుకున్నారు.హత్యకు గురైన దుర్గా రెడ్డి మృతదేహాన్ని చూసి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
అయితే ఘటన తెలిసిన క్షణాల్లోనే హుటాహుటిన రోషన్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని హత్య జరగడానికి దారి తీసిన కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. హత్యకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ ఆదేశించారు.
దుర్గా రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఆ కుటుంబానికి అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు. స్థానిక పోలీసుల అధికారుల నిర్లక్ష్యం తీరుపై శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe