జూలై 16, 2026
TRINETHRAM NEWS

అనపర్తి:త్రినేత్రం న్యూస్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐ.ఎమ్.ఎ. అనపర్తి వారు ది.వి. 27-04-2025, ఆదివారం నాడు జి.బి.ఆర్ విద్యాసంస్థలో ఉచిత విద్యాపధకం ఐ.ఎమ్.ఎ. టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఐ.ఎమ్.ఎ. డాక్టర్స్ శ్రీ తాడి రామగుర్రెడ్డి , జి.యస్.ఎన్. రెడ్డి , తేతలి వెంకట రామిరెడ్డి, సువర్ణ హస్తాల మీదుగా ప్రశ్నాపత్రం ఆవిష్కరణ జరిగినది. పరీక్ష ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించబడినది. ఒకటి నుండి పదవ తరగతి వరకు 1180 మంది రిజిస్ట్రేషన్లు చేయించుకోగా 1029 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరైనారు. ఈ ఐ.ఎమ్.ఎ పరీక్ష నిష్ణాతులైన ఐ.ఎమ్.ఎ. కమిటీ ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించబడినది. నర్సరీ, ఎల్. కె. జి. , యు. కె. జి. తరగతులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి పరీక్షా ఫలితాలు ఐ.ఎమ్. ఎ. డాక్టర్ల చేతుల మీదుగా డ్రా తీయడం ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఈ ఐ.ఎమ్.ఎ. పరీక్ష ద్వారా ప్రతీ తరగతికి మొదటి 5 స్థానాలు సాధించిన విద్యార్ధులను ఎంపిక చేసి వారికి 2025-26 విద్యా సంవత్సరంలో ఉచిత విద్యను అందించుట, దాని ద్వారా పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని జి.బి.ఆర్. సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీ తేతలి ఆదిరెడ్డి (కొండబాబు) గారు తెలియజేశారు. ఐ.ఎమ్.ఎ. టాలెంట్ టెస్ట్ నిర్వహణకై సహకరించిన ఉపాధ్యాయ బృందానికి, ఇంతటి విశేష స్పందనకు కారణమైన ప్రజలకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

IMA free education scheme

You cannot copy content of this page