Collector Koya : పెద్దపల్లి జిల్లాలో 82.27 శాతం పోలింగ్ నమోదు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TRINETHRAM NEWS

*కలెక్టరేట్ లో మొదటి దశ పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, డిసెంబర్ 11: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత 82.27 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ఎన్.ఐ.సి కేంద్రంలో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న 5 మండలాలకు సంబంధించి ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ స్క్రీన్స్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించి నమోదైన పోలింగ్ శాతం వివరాలను కలెక్టర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, మధ్యాహ్నం 1 గంట వరకు పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న 5 మండలాల పరిధిలో 82.27 శాతం వరకు పోలింగ్ నమోదైందని, లక్షా 18 వేల 346 మంది ఓటర్లు తమ ఓటు హక్కు పంచాయతీ ఎన్నికల్లో వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు ఈ పరిశీలనలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

82.27 percent polling registered in Peddapalli district

You cannot copy content of this page

Scroll to Top