79th Independence Day : ఘనంగా పప్పుడువలసలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ ఆగస్టు 16: అరకువ్యాలీ మండలం, చోంపి పంచాయతీ పరిధిలోని, పప్పుడువలస గ్రామ ప్రభుత్వ ప్రాథమిక (టి‌డబ్ల్యూ) పాఠశాలలో 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయురాలు కే.జయంతి, భాషా పండితుడు సీతారాం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు స్థానిక ఎంపీటీసీ సోమిలి జానకి,మాజీ సర్పంచ్ గుడివాడ ప్రకాష్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం మాట్లాడిన వారు, స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకున్నారు. చిన్నారుల్లో దేశభక్తి జ్వాలను రగిలించేలా వీరుల త్యాగాల గాథలను వివరించారు.
కార్యక్రమంలో వార్డు సభ్యురాలు సన్యాసమ్మ, త్రినేత్రంన్యూస్ రిపోర్టర్ రాజు, స్కూల్ చైర్మన్ శుక్ర, పెసా కమిటీ సభ్యుడు మల్లేష్, ఆశా వర్కర్ బంగారమ్మ, అంగన్వాడి టీచర్లు ఆదిలక్ష్మి, కుమారి, హెల్పర్లు కొండమ్మ, పద్మ పాల్గొన్నారు. గ్రామస్థులు ఎస్‌.బాలు, వెంకటరావు, కొండలరావు, స్వామి మహేష్, విజయ్,రాము,గణేష్ రేవతి, దివ్య తదితరులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

79th Independence Day celebrations

You cannot copy content of this page

Scroll to Top