జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 24 at 7.21.42 PM

TRINETHRAM NEWS

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే 5గురు మృతి

హైదరాబాద్: క్రిస్మస్ పండుగ వేళ.. ఆదివారం సాయంత్రం నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం జక్లేరు జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి..

ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది..

స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. యాక్సిడెంట్ కావడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

You cannot copy content of this page