క్రైస్తవ సోదర, సోదరీమణులకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రిస్మస్‌ శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

Christmas Wishes: క్రైస్తవ సోదర, సోదరీమణులకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రిస్మస్‌ శుభాకాంక్షలు..

అమరావతి..

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులు అందరికీ చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు..

దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు..

నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని చంద్రబాబు అన్నారు..

ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు..

You cannot copy content of this page

Scroll to Top