Earthquake : లడఖ్‌లో 5.7 తీవ్రతతో భూకంపం

TRINETHRAM NEWS

Trinethram News : Jan 19, 2026, భారత్‌లోని కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైంది.

ఉదయం 11:51 గంటలకు సంభవించిన ఈ ప్రకంపనలు లేహ్‌తో పాటు జమ్మూ కశ్మీర్, మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లోనూ స్పష్టంగా అనిపించాయి. భూకంపం భూ అంతర్భాగంలో 171 కిలోమీటర్ల లోతులో పుట్టినట్లు అధికారులు తెలిపారు. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

5.7 magnitude earthquake hits Ladakh

You cannot copy content of this page

Scroll to Top