MLA Kavya Krishna Reddy : 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ర్యాలీ..జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: జనవరి 30 :నెల్లూరు జిల్లా :కావలి నెల్లూరు జిల్లా,కావలి ఆర్‌టీఓ వారి ఆధ్వర్యంలో 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని బ్రిడ్జి సెంటర్ నుండి సెల్ఫీ పాయింట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌టీఓ అధికారులు, ఇతర శాఖల అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే నినాదాలు చేశారు. హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ తప్పనిసరిగా వాడటం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ప్రజలకు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా యువత, విద్యార్థులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి ప్రమాదరహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని తెలిపారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

37th National Road Safety Month Rally

You cannot copy content of this page

Scroll to Top