CM Relief Fund : 2’50’000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి(ఎల్ ఓ సి) అందజేత

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 24 : కూకట్పల్లి నియోజక వర్గం కూకట్పల్లి డివిజన్ లో నివాసం ఉంటున్న కోడిరెక్కల రామారావు. సన్ ఆఫ్ నాగయ్య. వయస్సు 45 సంవత్సరాలు, కిడ్నీ సమస్యతో నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వారి భార్య రత్నకుమారి కూకట్పల్లి లోని గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కార్యాలయం లో సంప్రదించగా వారికి కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిది కి అప్లై చేయడం జరిగింది.. వారికి 2,50,000 రూపాయల ఎల్ ఓ సి మంజూరు అయ్యింది..
ఆ ఎల్ ఓ సి లెటర్ ను కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ మరియు కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా రామారావు భార్య రత్నకుమారికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు మేకల రమేష్,శివచౌదరి,బొట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రత్నకుమారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బండి రమేష్,కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

2'50'000 rupees Chief Minister's

You cannot copy content of this page

Scroll to Top