జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 28 at 16.33.26

TRINETHRAM NEWS
 డ్రైనేజీల నిర్మాణానికి 21 లక్షలు నిధులు. 

ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇబ్రహీంపట్నం మండలం , చిలుకూరు గ్రామంలో మండల పరిషత్ నుంచి డ్రైనేజీల నిర్మాణానికి 21 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఎంపీపీ పాలడుగు . జోత్స్న , దుర్గ ప్రసాద్ స్పష్టం చేయడం జరిగింది. గ్రామంలో కూటమి నాయకులతో కలిసి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పడం జరిగింది.

నిర్మాణం పూర్తి చేస్తే గ్రామంలో మురుగు సమస్య ఉండదని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తిచేయాలని ఆదేశించారు. మౌలిక సమస్యల కల్పనకు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలుకూరు సర్పంచ్ గొంది . సురేష్ , నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page