17 తేమ శాతం రాగానే ధాన్యం కొనుగోలు చేయాలి అదనపు కలెక్టర్ డి.వేణు
*పెద్దపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన అదనపు కలెక్టర్
పెద్దపల్లి పల్లి, నవంబర్ -30:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం 17 తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు అన్నారు.
శనివారం అదనపు కలెక్టర్ డి.వేణు పెద్దపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్, కొత్తపల్లి గ్రామాలలో లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యతను నిరంతరం పరిశీలించాలని, ధాన్యం తేమ శాతం 17 రాగానే వెంటనే కొనుగోలు చేసి, సెంటర్ కు కేటాయించిన రైస్ మిల్లులకు త్వరితగతిన తరలించే లా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 100% కొనుగోలు చేసిన ధాన్యం వివరాల ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని, రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు లేకుండా చూడాలని అన్నారు.
ఈ పర్యటనలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App