WhatsApp Image 2024 11 30 at 15.29.25
రైతుపై దాడి చేసిన పులి.. తీవ్ర గాయాలు
Trinethram News : ఆదిలాబాద్ : Nov 30, 2024,
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం ఓ మహళపై దాడి చేసి చంపిన పులి.. శనివారం మరో రైతుపై దాడి చేసింది. సిర్పూర్(టీ) మండలం దుబ్బగూడ గ్రామంలో సురేశ్ అనే రైతు కంది చేనులో ఉండగా దాడి చేసింది. రైతుకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కాగా అటవీ శాఖ అధికారులు పులి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
