WhatsApp Image 2024 06 20 at 17.46.45
100 quintals of illegal ration rice Pattiveta District Civil Supplies Department Officer Prem Kumar
ధర్మారం, జూన్ 20: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో 100 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం నిల్వలు పట్టుకోవడం జరిగిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు.
గురువారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ ధర్మారం మండలంలోని నరసింహులపల్లి గ్రామం ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న ఓపెన్ ఏరియా నందు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న ఓపెన్ ఏరియాలో దాదాపు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం డంప్ ను గుర్తించామని, ఈ బియ్యాన్ని ఎవరు క్లెయిమ్ చేయడం లేదని, పంచనామా నిర్వహించి జిల్లా కలెక్టర్ తదుపరి ఆదేశాల వరకు ఎం.ఎల్.ఎస్ పాయింట్ వద్ద ఈ బియ్యాన్ని భద్రపరచడం జరుగుతుందని అన్నారు.
ఈ తనిఖీలలో సంబంధిత అధికారులు, తదితరులు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంట ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
