1/70చట్టం జోలికి రావద్దు
11 ఫిబ్రవరి 2025 రాజమహేంద్రవరం, ఆదివాసి, ప్రజాసంఘాలు, నాయకులు.
గిరిజనుల జీవనాదరమైన 1/70చట్టం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని గిరిజన, ఆదివాసీ, రైతు కూలీ, ప్రజా సంఘాల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.
ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలని చేసిన వ్యాఖ్యలకు నిరసన గా 11,12 తేదీల్లో జరుగుతున్నరాష్ట్ర వ్యాప్త “ఏజెన్సీ బంద్” సంఘీభావంగా రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం పల్లా వెంకట్ నాయుడు, మాట్లాడుతూ ఒకవైపు జి ఓ 3 లేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దూరమౌతున్న నేపథ్యంలో, మరో వైపు షెడ్యూల్డు గ్రామాల గుర్తిపు లేక అనేక, సరైన జీవన స్థితిగతులు కరువై అవస్థలు పడుతున్న గిరిజనులకు అడవి కి దూరం చేసి, బ్రతుకులు లేకుండా, అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే చర్యలను చూస్తూ ఊరుకోమని స్పష్టం చేసారు.
1/70 చట్టం రద్దు, సవరణ వంటి ఆలోచన మాను కోవాలని డిమాండ్ చేసారు. నేడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి పూనుకుందన్నారు ప్రభుత్వం తన దాడిని ఆదివాసీలపై ప్రధానంగా ఎక్కిపెట్టిందన్నారు అందులో భాగంగానే మధ్యభారతము మరియు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న కనీసంపద నిక్షేపాలను స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి అడవి నుండి ఆదివాసీలను గెంటి వేయడానికి అటవీ సంరక్షణ చట్టం 22 పేరుతో ముందుకొచ్చింది అన్నారు ఫారెస్టు, పోలీసు అధికారులకు విశిష్టమైన అధికారాలను కట్టబెట్టి ఆదివాసీలకు రక్షణగా ఉన్న వారి పక్షాన గొంతేచుచున్న విప్లవ ప్రజాస్వామిక బుద్ధి జీవులను అభివృద్ధి నిరోధకులుగా ప్రచారం చేస్తూ అణచి వేయడానికి అన్ని రకాలుగా పూకుంటుంది ఆదివాసీలను అడవుల నుండి గెంటి వేయడం ద్వారా వారిని నిరాశలు చేయడమే కాకుండా పర్యావరణానికి పెనుముప్పు కలిగించేలా భారత ప్రజల సమస్యగా మారుతుంది అన్నారు అందువల్ల ఆదివాసీలపై దాడిని వారి ఒక్కరి సమస్యగా చూడకుండా భారత ప్రజల చూడాలన్నారు, ఆదివాసీలతో గొంతు కలిపి ఆదివాసీలు సాగిస్తున్న పోరాటాలకు ప్రజలందరూ అండదండలు అందించాలని కేంద్ర రాష్ట్ర పాలకులు ఆదివాసీలపై సాగిస్తున్న మూకుముడి దాడిని అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని అన్నారు
బుధవారం కూడాజరుగుతున్న ” ఏజెన్సీ ఆదివాసి బందుకు బంద్” కు ప్రజలు, వాణిజ్య, వర్తక, వ్యాపారాలు అందరూ సహకారం అందించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికా, పిడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహర్షి, గిరిజన, ఆదివాసి నాయకులు నూకరాజు. నాగన్న. అప్పారావు, నాగమణి, గౌరమ్మ, మరియు గిరిజన ఆదివాసీలు పాల్గొన్నారు.
ఇట్లు
పల్ల వెంకట్ నాయుడు
ప్రధాన కార్యదర్శి,
అఖిల భారత రైతు కూలి సంఘం,తూర్పుగోదావరి జిల్లా.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


