నవంబర్ 22, 2026
TRINETHRAM NEWS
YSRCP candidates

YSRCP Candidate : పెనుమూరు. అక్టోబర్ 2(త్రినేత్రం న్యూస్):- గుత్తావాండ్లవూరు సెగ్మెంటు వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కె.మంజుకుమార్ ను, పెనుమూరు మండల జడ్పీటీసీ అభ్యర్థి పి.నిరీషాగిరిధర్ రెడ్డి ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గడపగడపకు తిరిగిన వైసీపీ శ్రేణులు. గుత్తావాండ్లవూరు ఎంపీటీసీ అభ్యర్థి మంజుకుమార్ మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే ఈ సెగ్మెంటు పరిధిలోని గుత్తావాండ్లవూరు, ఎల్కేపీవూరు, గంగుపల్లి పంచాయతీల లోని గ్రామాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు. మేము ప్రచారంలో ముఖ్యంగా గమనించిన సమస్య డ్రైనేజి.

చాలా గ్రామాలలో డ్రైనేజీ కాలువలు కానీ, పైపులు గానీ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడటాన్ని గమనించామని, ప్రజలు నన్ను ఆదరించి, గెలిపిస్తే సంవత్సరం లోపల ఈ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ ఏ ఎం సీ చైర్మన్ జ్యోతి నాథ్, యస్ సి సెల్ రాము, వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మనోహర్, వై సీ పి నాయకులు సురేష్ రెడ్డి, వినోద్ రెడ్డి, దేవరాజులు శెట్టి, భాను, రాజేష్, మధు, యువరాజ్, వంశీ, శివయ్య, కిరణ్ ఇంకా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page