నవంబర్ 22, 2026
TRINETHRAM NEWS
YSRCP Rally

YSRCP Rally : అరకులోయ, నవంబర్ 3, (త్రినేత్రం న్యూస్): అల్లూరి జిల్లా అరకువ్యాలీ మండలం చొంపి, సిరిగం సెగ్మెంట్ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి నందిల సుంక్రయ్య గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో సోమవారం కప్పలగొంది గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నరావు ఆధ్వర్యంలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ నందిల సుంక్రయ్య ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ర్యాలీకి గ్రామస్థుల నుంచి విశేష స్పందన లభించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page