Trinethram News : వినుకొండ: వినుకొండ మాజీ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు మహాత్మ జ్యోతిరావు పూలే సమాజ అభ్యున్నతికి చేసిన అద్భుత సేవలను కొనియాడారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల విద్య, హక్కుల సాధన, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి నేటికీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్య ద్వారా అసమానతలను నిర్మూలించాలన్న పూలే మహోన్నత ఆశయాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


