TELANGANA

Youth Dies : కారు బావిలో పడి యువకుడి దుర్మరణం

TRINETHRAM NEWS

నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలో మంగళవారం రాత్రి కారు అదుపుతప్పి బావిలో పడటంతో శ్రీనివాస్ (38) అనే యువకుడు మృతి చెందాడు. అత్యవసర పనిమీద రంగపేట్ వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కొమ్ముతండా సమీపంలో రహదారి పక్కనే ఉన్న బావిలో కారు దూసుకెళ్లింది. మృతుడు కడం మండలంలోని ‘మన్ గ్రోమోర్’ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Youth dies after car falls into well

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page