Petla Uma Shankar : కళాశాలను సందర్శించిన వైసిపి నాయకులు

TRINETHRAM NEWS

తేదీ : 19/09/2025. అనకాపల్లి జిల్లా: (త్రినేత్రం న్యూస్); నర్సీపట్నం మండలం లో ఉన్నటువంటి వైద్య కళాశాలను జిల్లా వైసీపీ నాయకులు, మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఇప్పటికే అరవై శాతం పనులు పూర్తి అయిన కళాశాల కూటమి నాయకుల కంటికి కనిపించకపోవడం విచిత్రంగా ఉందని, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పేదలకు అందవలసిన వైద్యం, విద్య పై కక్ష గట్టి పెత్తం దారులకు అప్పచెప్పుతుందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అందాయని, ప్రజలు చెబుతున్నారు.

గత ప్రభుత్వం వైసిపి పాలనలో రాష్ట్రం చీకట్లో ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఉదయించే సూర్యుడు వలె రాష్ట్రానికి వెలుగునిస్తుందని, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ ప్రభుత్వంపై ఎటువంటి చెడు ఆరోపణలు చేసిన, కట్టని కళాశాలలను కట్టినాము అని ప్రభుత్వంపై ధ్వజమెత్తెన మేము నమ్మేస్థితిలో లేమని ప్రజలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YCP leaders visited the college

You cannot copy content of this page

Scroll to Top