YCP Leader : డౌనూరు ప్రభుత్వ వైద్యుని సన్మానించిన వైసీపీ నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రంన్యూస్, (కొయ్యూరు) నియోజకవర్గఇంచార్జ్: అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలంలోని డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పిహెచ్‌సి) నూతనంగా బాధ్యతలు స్వీకరించిన, డాక్టర్ కె. వినయ్ కుమార్ ని జడ్పీటిసి సభ్యులు వారా నూకరాజు మరియు డౌనూరు సింగ్మెంట్ ఎంపిటిసి, వైఎస్సార్‌సిపి పార్టీ మండల అధ్యక్షులు బిడిజాన అప్పారావు మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు డాక్టర్ వినయ్ కుమార్ కి శాలువా కప్పి, సగర్వంగా పరిచయం చేసుకున్నారు.

డౌనూరు సింగ్మెంట్ పరిధిలోని గ్రామాలలో పర్యటించి, ప్రజలకు అందుబాటులో ఉండాలని మరియు రోగులకు సక్రమంగా చికిత్స అందించాలని, డాక్టర్ వినయ్ కుమార్ ని వారు కోరారు. అంతేకాకుండా, ఈ సందర్భంగా వారు డాక్టర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ స్థానిక సీనియర్ నాయకులు పండ్రా గంగరాజు మరియు ప్రజాప్రతినిధులు డాక్టర్ వినయ్ కుమార్ సేవలు సమర్థవంతంగా అందించాలని ఆకాంక్షించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YCP leaders honour Daunur

You cannot copy content of this page

Scroll to Top