
తేదీ : 10/04/2025. చిత్తూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజవర్గం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన దేవస్థానంలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని కుటుంబ సమేతంగా యన్ టి ఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడ యంపి కేశినేని.. శివనాద్. (చిన్ని), ఆయన సతీమణి కేశినేని. జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్ తో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు.
అంతరం ఆస్థాన మండపం నందు స్వామి వారి శేష వస్త్రము, తీర్థ ప్రసాదాలు, వారి చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి, దేశంలోనే విఘ్నేశ్వరుడి ఆలయాలలో ఎంతో ప్రసిద్ధమైన వేయ్యి ఏళ్లుచరిత్ర కలిగిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు నాయుడు, నాయకత్వంలోని కూటమిప్రభుత్వంలో ప్రజలు బాగుండాలని, మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరి ప్రార్థించినట్లు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
