కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని కలిసి కోరిన ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు.
రామగుండం మే-21//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంగళవారం న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ బి.కె శ్రీవాస్తవ్, పి.కె.సింగ్ రాథోడ్ కోరారని ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ కన్వీనర్లు దండంరాజు రామచందర్ రావు,ఆళవందార్ వేణు మాధవ్ లు ఒక సంయుక్త ప్రకటన లో పేర్కొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బొగ్గు రంగంలో పెన్షనర్ల దుస్థితి మరియు వేగవంతమైన సంస్కరణల ఆవశ్యకత గురించి ఆయనకు వివరించారని, తక్కువ పెన్షన్‌తో బతికే బొగ్గు పెన్షనర్ల బాధలను మంత్రివర్యులకు వివరించడం తో పాటు కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు పెన్షనర్లను వేధిస్తున్న సమస్యలను మరియు చాలా కాలం క్రితం పదవీ విరమణ చేసిన వారి దయనీయ స్థితిని పరిష్కరించడానికి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు అభ్యర్థించారని వారు తెలిపారు.
ప్రస్తుత పెన్షన్ సరిపోక పెన్షనర్లు ఆకలితో అలమటిస్తున్న పేద పెన్షనర్ల దుస్థితి పెన్షన్‌ను పెంచడానికి వేగవంతమైన సంస్కరణల కోసం కేంద్ర మంత్రి జోక్యం చేసుకోవాలని కోరారని, ఇందుకు మంత్రివర్యులు సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తపరుస్తున్నామని ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ కన్వీనర్లు దండంరాజు రామచందర్ రావు,ఆళవందార్ వేణు మాధవ్ ఒక ప్రకటన లో తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


