Wonderful Governance : అద్భుత పాలన

TRINETHRAM NEWS

తేదీ : 23/10/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; అశ్వరావుపేట నియోజకవర్గం, మండలం, దమ్మపేట మండలం లో ఉన్నటువంటి గ్రామాలు పాత అల్లిగూడెం, మారప్పగూడెం, రంగు వారి గూడెం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూణెం. రాములు, కె. కొండ, పి .వెంకటేశ్వరరావు( మాజీ ఎంపీటీసీ) కె .భద్ర రావు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ పరిపాలన అద్భుతంగా ఉందని తెలిపారు . నిరుపేదలకు ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డులు , రూపాయలు ఐదు వందలకు వంట గ్యాస్ సిలిండర్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించారని పేర్కొన్నారు. ఇంతకన్నఇంకా ఏమి కావాలి అని , ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని సూచించారు.
రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన అధిక మెజార్టీతో ఈ ప్రభుత్వం గెలుస్తుందని ధీమా వ్యక్తపరిచారు శాసనసభ్యులు జారే ఆదినారాయణ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ వాళ్ల అభిప్రాయాలను తెలియపరిచారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే మేము చేసే పరిష్కారం మేము చేస్తున్నాము. ఆ సమస్యకు పరిష్కారం ఎవరు చేస్తే అవుతుందో వాళ్లతో చేపిస్తున్నామని అన్నారు .వీధి దీపాలు ,త్రాగునీరు సిసి రోడ్లు డ్రైనేజీ సంబంధించి ఎటువంటి లోటు పాటు లేదని హర్షం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Wonderful governance

You cannot copy content of this page

Scroll to Top