మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊరట.
మహిళల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి.
మహిళను బలపర్చడం అంటే ఒక కుటుంబం, సమాజం, భవిష్యత్తు తరాలకు అండగా ఉండడమే.
మహిళ ఎదుగుదల అంటే ఒక ఇంటి గౌరవం కాదు.. ఒక రాష్ట్రం పురోగతి.
ఇందిరమ్మ చీరలు – తెలంగాణలోని ప్రతి మహిళకు అందజేస్తాం.
ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ డివిజన్ నవంబర్ 25 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మహిళ సంఘాలకు వడ్డీ లేని ఋణాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనీ దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ… వ్యాపారాలు చేయడం మగవారికి మాత్రమే సాధ్యమేమోనన్న కాలం పోయింది. మగువలు సైతం మహాద్భుతాలు సృష్టించే రోజు వచ్చింది. రేవంతన్న అండతో తెలంగాణలో మహిళా స్వయం సహాయక బృందాలు సరికొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర కీర్తిని రెపరెపలాడిస్తున్నాయి. మహిళలు కోటీశ్వరులు కావాలన్నది కల కాదు… ప్రజా ప్రభుత్వం దాన్ని నిజం చేసి చూపిస్తోందనీ పేర్కొన్నారు.ఉచిత బస్సు ప్రయాణం నుంచి ఆర్టీసీకి అద్దె బస్సులు ఇచ్చే స్థాయికి మహిళా సంఘాలు ఎదిగాయి . పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్లాంట్లు, రైస్ మిల్లులు, గోదాములు నిర్వహించే స్థాయికి చేరాయి.
ఈ ప్రయాణాన్ని ప్రజా ప్రభుత్వంలో ఇలాగే కొనసాగిద్దాం.. ప్రపంచానికి మన మహిళల సత్తాను చాటుదాంఅన్నారు. ప్రతి మహిళకు నాణ్యమైన చీరలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సిరిసిల్లలోని చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చీరలను తయారు చేయించారని పేర్కొన్నాను. మహిళా సంఘాలతో పాటు ప్రతి ఇంటి మహిళలకు ఈ చీరలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాల అక్కాచెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 304 కోట్లు వడ్డీ లేని రుణాలుగా జమ చేయడం జరిగింది. ప్రజా ప్రభుత్వం ప్రతి అక్కచెల్లెలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు,తమ స్వంత ఆదాయ మార్గాలు నిర్మించుకునేందుకు అండగా నిలుస్తోంది. 4480 సంఘాలకు 11కోట్ల 93లక్షల రూపాయల వడ్డీలేనిరుణాలు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, దొంతం అలివేలు సంజీవ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, పార్లమెంటు కో కో ఆర్డినేట్ సిరాజ్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యూనుస్, పిఎసిఎస్ చైర్మన్ జాల నర్సింహా రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు బాధ్య నాయక్, నాగభూషణ్, ఎల్లయ్య యాదవ్, మాజీ జడ్పీటీసీ అరుణ సురేష్ గౌడ్, మాజీ ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి,బిక్కు నాయక్, గోవిందా యాదవ్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యాయులు కొర్ర రాంసింగ్ నాయక్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పాల్వాయి వెంకట్ రెడ్డి,మల్లా రెడ్డి, కాసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ పిడి రాజ్ కుమార్, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


