Trinethram News : ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధి “అపర్ణ పామ్ గ్రో” నందు ఏర్పాటుచేసిన దుర్గామాత నవరాత్రి వేడుకలకు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. శక్తికి రూపం అమ్మవారి స్వరూపమని, అమ్మ దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, మాజీ కౌన్సిలర్ పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, నాయకులు ఎండీ.ఖాదర్ (షన్ను భాయ్), భూలక్ష్మణ్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


