జూన్ 27, 2026

WhatsApp Image 2024 12 19 at 16.28.07

TRINETHRAM NEWS

అయ్యప్పస్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరు సుఖసంతోషాలతో వర్దిలాలి

రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

అయ్యప్పస్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరు సుఖసంతోషాలతో వర్దిలాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ స్వామి వారిని వేడుకున్నారు. గోదావరిఖని పోచమ్మ దేవాలయం ఆవరణలో ధర్మశాస్త్ర నిత్యన్నాధాన వేదిక వార్షికోత్సవం
సందర్భంగా అయ్యప్పస్వామి వారి పడి పూజ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే గారు పాల్గొని మాట్లాడారు. కౌటం బాబు గత 36 సంవత్సరాలుగా అయ్యప్పస్వామి దీక్షను తీసుకుని శ్రీ ధర్మశాస్త్ర నిత్యన్నాధాన వేదిక ఎర్పాటు చేసి ఎన్నో ఎళ్లుగా అనార్దులకు అన్నదానం చేయండం గొప్ప విషయం అన్నారు. 41 రోజుల పాటు పోచమ్మ దేవాలయం ఆవరణ అన్నవితరణ కార్యక్రమం చేపట్టడం సంతోషకరం అన్నారు. తాము ఎన్నో ఎళ్లుగా అయ్యప్పస్వామి దీక్షను తీసుకోవడం జరుగిందని మూడు సంవత్సరాలు అయ్యప్పస్వామి వారి 108 రోజుల దీక్షను తీసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం లో ధర్మశాస్త్ర వెధిక వ్యవస్దపాకులు కౌటం బాబు రఘుసింగ్ కార్పోరేటర్లు పాముకుంట్ల భాస్కర్ కల్వచర్ల కృష్ణ వేణీ గాధం విజయ నాయకులు నారాయణదాసు మారుతి పర్లపల్లి రవి కుడుదుల శ్రీనివాస్ మహేందర్ వెంకన్న ముద్దసాని సంధ్యా రెడ్డి అవునూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page