
Trinethram News : AP: ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ వైసీపీ, టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మేనిఫెస్టో విడుదలపై మీనమేషాలు లెక్కిస్తున్నాయి. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో ప్రచారం చేసుకుంటున్నా.. ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంకా కసరత్తు చేస్తున్నట్లు కూటమి వర్గాలు వెల్లడిస్తున్నాయి. వైసీపీ నుంచి ఇంకా ఎన్నికల హామీలు బయటకు రావట్లేదు. అమలు చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెడతామని, త్వరలోనే విడుదల చేస్తామని సీఎం జగన్ చెబుతున్నారు.
