ప్రత్యర్థిని చిన్నాభిన్నం చేసే వ్యూహాలకు ఏపీ రాజకీయాలు వేదికగా మారిన తరుణంలో.. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, టీడీపీ కార్యకర్తలపై కేసులు.. తదితర అంశాలన్నీ మాజీ సీఎం జగన్ మీదకు విరుచు పడటం ఖాయమని జనం అభిప్రాయం. ఇప్పటికే సీబీఐ కోర్టులో కేసుల విచారణ జాప్యం వ్యవహారంపై అటు కేంద్రం, ఇటు కూటమి సర్కారు దృష్టి సారిస్తాయని వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నారు.
ఈ స్థితిలో మాజీ సీఎం మళ్లీ జైలుకు వెళ్తే.. తమ పార్టీ పరిస్థితి ఏమిటని వైసీపీ శ్రేణులు తర్జన భర్జన పడుతున్నాయి. 2014 ఎన్నికల ముందు వైఎస్ జగన్ సోదరి షర్మిల పార్టీ రథ సారధి పాత్ర పోషించారు. 3000 కిలోమీటర్ల పాదయాత్రతో వైఎస్ఆర్ సీపీకి టానిక్ అందించారు. ప్రస్తుతం మాజీ సీఎం జగన్ తరువాత సెకండ్ లీడర్ ఎవరనే అంశంపైనే పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది.
భారతమ్మ రెడీ,,,!?
ముందస్తు ఉపద్రవాన్ని పసిగట్టిన వైసీపీ అధిష్టానం.. పార్టీ పగ్గాలను ఎవరికి అప్పగించాలనే అంశంపై మేధో మథనం జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తరువాత ఆయనను జైలుకు పంపిస్తే.. నాయకత్వ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి? ఆయన సతీమణి భారతీకి ఇవ్వాలా? లేక పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని నెంబర్ టూ గా ప్రకటించాలా?
అని ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చపై ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ వైఎస్ భారతీ పారిశ్రామిక వేత్తగా కార్యకలాపాలను నిర్వహించినా.. ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా ఏనాడు కనిపించలేదు. కానీ రాజ్యాంగేతర శక్తిగా ఆమె పరోక్షంగా.. వైసీపీని శాసించిన మాట నిజం. ఒక రకంగా పతి జగన్ మోహన్ నిర్ణయాల్లో.. పరదా వెనుక శివగామి పాత్ర ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది.
కానీ మాజీ సీఎం జగన్ కు అత్యంత ఆప్తులే నెంబర్ టూ స్థానంలో ఉంటారు. భారతీని రాజకీయ ఆరంగ్రేటం చేయాలంటే సీఎం జగన్ రాజీనామా చేయాలి, పులివెందుల నుంచి భారతీని గెలిపించాలి? ఇదంతా పెద్ద ప్రాసెస్సే. ఈ స్థితిలో ప్రత్యామ్నాయ బాధ్యతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగిస్తే ఎలా ఉంటుందని వైసీపీ వర్గాలు తర్జన భర్జన పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App