TRINETHRAM NEWS

What is a rave party?

రేవ్ అన్న పదం జమైకా భాష నుంచి వచ్చింది. చెవులు దద్దరిల్లే మ్యూజిక్‌తో ఈ పార్టీలలో యువతీ యువకులు ఉల్లాసంగా డాన్సులు చేస్తుంటారు. రేవ్ పార్టీ అంటే ఆల్కహాల్ తో పాటు డ్రగ్స్ కూడా ఉంటాయి. చీకటి గదిలో లేజర్ లైట్ల వెలుగులో మ్యూజిక్ ప్లే చేస్తారు. ఫుడ్,కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు, కొకైన్, హషిష్, చరాస్, ఎల్ఎస్ డి… ఒక్కటేమిటి యువత అన్నీ మరిచి చిందులు వేయడానికి ఈ పార్టీలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అయితే, రేవ్ పార్టీకి పరిచయస్తులనే ఆహ్వానిస్తారు. కొత్తవారిని రేవ్ పార్టీలకు అనుమతించరు. కొత్తవారి వల్ల సమాచారం బయటకు వస్తుందని అనుమానిస్తారు.

60వ దశకంలో యూరోపియన్ దేశాల్లో మద్యం కోసం పార్టీలు నిర్వహించేవారు.80వ దశకానికి వచ్చేసరికి పరిస్థితి మారింది. 90వ దశకంలో ఈ పార్టీల స్వరూపం బాగా మారింది. డ్రగ్స్ వాడకం మాములైపోయింది. అంతేకాదు, సెక్స్ కాక్ టెయిల్స్ కూడా రేవ్ పార్టీలలో కామన్ అంటారు. ఈ పార్టీలను 24 గంటల నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు.

ఈ పార్టీలు మొదట గోవాలో ప్రారంభమయ్యాయి. అక్కడ హిప్పీలు ఈ పార్టీలు ప్రారంభించారు. వీటి నిర్వాహకులు గోప్యత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే, సెలబ్రిటీలు రేవ్ పార్టీలపై ఎక్కువగా మొగ్గుచూపుతారు. అయినా సరే, అవి ఎలాగోలా బయటపడుతుంటాయి. పోలీసుల కంట పడుతుంటాయి.

లేటెస్ట్ గా బెంగళూరు రేవ్ పార్టీ అందుకొక ఉదాహరణ.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

What is a rave party?