Welspun Foundation : వెల్స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వకృతి సేంద్రియ వ్యవసాయ అవగాహన

TRINETHRAM NEWS
Welspun Foundation organizes awareness

Welspun Foundation : త్రినేత్రం న్యూస్ /షాబాద్ ప్రతినిధి.. వెంకమ్మగూడ మరియు మచన్ పల్లి గ్రామాలలో వెల్స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ అవగాహన సదస్సులు విజయవంతంగా జరిగాయి. ఆయా గ్రామాల సర్పంచులు గుత్తి చెన్నయ్య మరియు బోడ రాధ గార్లు కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం వంటి సేంద్రీయ ద్రావణాల తయారీ విధానాలను ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు.

ఈ సేంద్రీయ ద్రావణాల వినియోగం ద్వారా నేల సారాన్ని పెంచడం, పంటల దిగుబడిని మెరుగుపరచడం, రసాయన ఎరువులపై ఆధారాన్ని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న రైతులు అడిగిన ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు ఇస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం ద్వారా రైతులు ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలను పండించి అధిక ఆదాయం పొందవచ్చని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెల్స్పన్ ఫౌండేషన్ CSR హెడ్ శ్రీమతి సురేఖ, అసిస్టెంట్ మేనేజర్ పవన్ కుమార్, భద్రయ్య, శ్వేత, రమేష్, మనీల, ఉప సర్పంచ్ లు మిద్దె హరీష్, మోముల విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ కార్యదర్శి సీత మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఆయా గ్రామాలకు చెందిన అనేక మంది రైతులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గ్రామ స్థాయిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రైతుల్లో ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం పట్ల చైతన్యం పెంపొందుతుందని, భవిష్యత్తులో మరిన్ని శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top