WhatsApp Image 2024 11 24 at 19.28.53
పట్టణాభివృద్ధికి కృషి చేస్తాం.
రూ.2.11 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి పట్టణ ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 15,16,17, 18 వార్డులల్లో రూ. 2.11 కోట్ల టియుఎఫ్ ఐడిసి నిధులతో చేపట్టే సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల పనులను స్ధానిక నాయకులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిలో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నేతేట్ల కొమురయ్య, రాజం మహంత, కోలిపాక సంధ్య చిరంజీవి, కోలిపాక శ్రీనివాస్, నూగ్గిళ్ల మల్లయ్య,భూతగడ్డ సంపత్, సయ్యద్ మసర్త్,సుభాష్ , శ్రీమాన్, తోట శంకర్, గంగుల వెంకటేష్, నామాని శ్రీనివాస్,మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు, వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
