MP Raghunandan : ‘సాయంత్రంలోగా చంపేస్తాం

TRINETHRAM NEWS

ఎంపీ రఘునందన్‌కు బెదిరింపు కాల్‌

Trinethram News : భాజపా ఎంపీ రఘునందన్‌రావుకు పీపుల్స్‌వార్‌ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్‌ వచ్చింది. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్‌ చేశాడు.తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఫోన్‌కాల్‌ను రఘునందన్‌ పీఏ లిఫ్ట్‌ చేశారు. బెదిరింపు కాల్‌పై డీజీపీ, మెదక్‌ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్‌ ఫిర్యాదు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

'We will kill him

You cannot copy content of this page

Scroll to Top