తేదీ : 01/02/2025.
ప్రజలకు ఇచ్చిన హామీలను అన్ని నెరవేరుస్తాం
అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు జిల్లా, అమరావతి,
సచివాలయంలో ముఖ్యమంత్రివర్యులు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని అనడం జరిగింది. డాబా ఎక్కాలంటే ఒకేసారి ఎక్కలేము ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటే వెళితే డాబా ఎక్కుతాము , అదేవిధంగా హామీలు కూడా ఒకదాని తరువాత మంచి ముహూర్తం చూసుకొని అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు.
పింఛన్లు పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపాము, ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము, కేంద్రం ఇచ్చే నిధులతో కలిసి రైతు భరోసా కింద మే నెలలో రూపాయలు ఇరవై వేలు, అలాగే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందిస్తామని ప్రకటించడం జరిగింది. కూటమి ప్రభుత్వంపై ప్రజలు అభినందనలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App