Lavanya : విద్యార్థులకు పండ్లు పంపిణీ కొనసాగిస్తాం

TRINETHRAM NEWS

We will continue to distribute fruits to students

తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య

పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తామని అలాగే

సుందిళ్ల ముస్తాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగిరి మండలంలోని ముస్త్యాల మరియు సుందిళ్ల గ్రామాల్లోని పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పండ్లు పంపిణీ కొనసాగిస్తామని ముస్త్యాల తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు అన్నారు. బుధవారం రామగిరి నంబమ్మ కన్నం బొందయ్యల జ్ఞాపకార్థంగా విద్యార్థిని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.

తాను సర్పంచ్ గా ఉన్న సమయంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని దాన్ని అలాగే కొనసాగిస్తామని గత ఐదు సంవత్సరాలుగా విద్యార్థిని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి బుధవారం ఆయా పాఠశాలల్లో సుమారు 400 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.

ఈ బుధవారం పండ్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. సమాజ సేవ చేసే వాళ్లకు పదవులతో సంబంధం లేదని అన్నారు మరియు ప్రతి బుధవారం విద్యార్థులకు పండ్ల పంపిణీ ఉంటుందని లావణ్య అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We will continue to distribute fruits to students

You cannot copy content of this page

Scroll to Top